ఆ టిడిపి ఇడియట్ ను చంద్రబాబే ప్రోత్సహించారా..!: వంగలపూడి అనిత సంచలనం

అమరావతి : జగన్ సర్కార్ అరాచక పాలనలో మహిళలకు రక్షణ కరువయ్యిందని టిడిపి నాయకురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు.

Share this Video

అమరావతి : జగన్ సర్కార్ అరాచక పాలనలో మహిళలకు రక్షణ కరువయ్యిందని టిడిపి నాయకురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో ఎవడో తెలుగుదేశం పార్టీ ఇడియట్ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడితే ఇది చంద్రబాబు ప్రోత్సాహంతోనే జరిగిందని మహిళా కమీషన్ చైర్ పర్సన్ కారుకూతలు కూసారని అనిత గుర్తుచేసారు. అయితే గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వివాహితపై ఆరుగురు గ్యాంగ్ రేప్ చేయడంపై ఏం సమాధానం చెబుతారని నిలదీసారు. 19ఏళ్ల యువతిని పెళ్లయిన ఇరవై రోజులకే ఆరుగురు ఆగంతకులు గ్యాంగ్ రేప్ చేసి నిస్సహాయ స్థితిలోని ఆమెను మార్కెట్ లో వదిలివెళ్ళారని అనిత పేర్కొన్నారు. తల్లిదండ్రులతో కలిసి ఫిర్యాదుచేయడానికి వెళితే డిఎస్పీ, సీఐ ఫిర్యాదు స్వీకరించడానికి తిరస్కరించమే కాదు బాధితురాలినే అసభ్య పదజాలంతో దూషించారన్నారు. ఈ మానసిక క్షోభను భరించలేక యువతి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన నిందితులను వైసిపి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని అనిత ఆరోపించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video