Asianet News TeluguAsianet News Telugu

చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు.... నలుగురు స్మగ్లర్లు అరెస్టు

ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ గురువారం చేసిన మెరుపు దాడుల్లో 46 ఎర్రచందనం దుంగ లు లభ్యమయ్యాయి.

ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ గురువారం చేసిన మెరుపు దాడుల్లో 46 ఎర్రచందనం దుంగ లు లభ్యమయ్యాయి. వాటిని మూసుకుని వస్తున్న స్మగ్లర్లు లో నలుగురు పట్టుబడ్డారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు గారికి అందిన సమాచారం మేరకు ఆర్ ఎస్ ఐ లు లింగాధర్, వాసు ల టీమ్ లు గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి తలకోన పరిసరాల్లో కూంబింగ్ చేపట్టింది.