నిద్రిస్తున్న బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి ( వీడియో)

బాలికపై అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు స్థానికులు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పెరికపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది. 
 

Share this Video

పల్నాడు జిల్లా (palnadu district) క్రోసూరు (krosuru) మండలం పెరికపాడు గ్రామంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి నిద్రిస్తున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన మందా నాగరాజు (45) అనే వ్యక్తి, మద్యం సేవించి అత్యాచారయత్నం (rape attempt) చేశాడు. అయితే బాలిక కేకలు వేయడంతో కుటుంబసభ్యులు, ఇరుగు పొరుగు వారు నిందితుడు నాగరాజును పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అప్పగించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Related Video