ముదురుతున్న పీఆర్సీ జీవోల వివాదం... సచివాలయంలో ఉద్యోగుల నిరసన

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్యోగులు గుర్రుగా వున్నారు.

First Published Jan 19, 2022, 12:55 PM IST | Last Updated Jan 19, 2022, 12:55 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్యోగులు గుర్రుగా వున్నారు. పీఆర్సీలో విషయంలో రాజీపడ్డ ఉద్యోగ సంఘాలను ఇటీవల వైసిపి ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు తీవ్ర అసంతృప్తికి గురిచేసాయి. ఈ క్రమంలో ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు అన్యాయం చేసేలా విడుదల చేసిన జీవలను వెనక్కి తీసుకోవాలంటూ సచివాలయ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది. సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో సచివాలయంలో విధులకు హాజరయ్యారు. పిఆర్సీపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని... లేదంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు.