జాతిరత్నాలును మించిన వినోదంతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి..: నవీన్ పొలిశెట్టి

విజయవాడ : త్వరలోనే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ విడుదల కానున్న నేపథ్యంలో హీరో నవీన్ పొలిశెట్టి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు.

Share this Video

విజయవాడ : త్వరలోనే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ విడుదల కానున్న నేపథ్యంలో హీరో నవీన్ పొలిశెట్టి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. వచ్చే నెల (సెప్టెంబర్) 7న హీరో నవీన్, హీరోయిన్ అనుష్క నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇవాళ విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్న నవీన్ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు నవీన్ కు తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనం అందించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అమ్మవారి దర్శనం అనంతరం నవీన్ మాట్లాడుతూ... తన ప్రతీ సినిమా రిలీజ్ కు ముందు అమ్మవారిని దర్శించుకుంటానని అన్నారు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరించి పెద్ద విజయాన్ని అందుకోవాలని అమ్మవారిని కోరుకున్నట్లు నవీన్ తెలిపారు. జాతిరత్నాలు మూవీలో ఎంతయితే ఎంటర్ టైన్ చేసామో ఈ సినిమాలో అంతకంటే ఎక్కువ ఎంటర్టైన్ మెంట్ వుంటుందని హీరో నవీన్ పొలిశెట్టి తెలిపారు. 

Related Video