జూమ్ యాపుల్లో, టీవీల్లో మాట్లాడం తప్ప చంద్రబాబు ఏం చేశాడు.. వెల్లంపల్లి

విజ‌య‌వాడ‌ కలెక్టరు క్యాంపు కార్యాలయంలో బుధ వారం కరోనా వైరస్ నియంత్రణ చర్యల పై అధికారులతో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమీక్ష నిర్వ‌హించారు. 

Share this Video

విజ‌య‌వాడ‌ కలెక్టరు క్యాంపు కార్యాలయంలో బుధ వారం కరోనా వైరస్ నియంత్రణ చర్యల పై అధికారులతో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమీక్ష నిర్వ‌హించారు. అనంత‌రం మంత్రి వెలంప‌ల్లి, తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్‌, క‌లెక్ట‌ర్ ఇంతియాజ్ అహ్మద్, సిపి బత్తిన శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ క‌లిసి మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌లు కరోనా‌తో ఇబ్బంది పడుతుంటే అచ్చెన్నాయుడును పరామర్శించ‌డం త‌ప్ప‌, చంద్రబాబు, లోకేష్, టిడిపి నేతలు ఏ ఒక్కరైనా ప్రజలకు భరోసా ‌ఇచ్చారా అని మంత్రి వెలంప‌ల్లి ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహించే స్థానంలో కృష్ణాజిల్లా నెంబర్ వన్ లో ఉందన్నారు. ఇంతవరకు 2,08,000 పరీక్షలు నిర్వహించగా, వాటిలో 6 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించడంలో జిల్లా ప్రధమస్థానంలో ఉందన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video