శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)
శ్రీశైలం ఎడమ గట్టు హైడల్ పవర్ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో షార్ట్సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి.
శ్రీశైలం ఎడమ గట్టు హైడల్ పవర్ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో షార్ట్సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్న సమయంలో నాలుగు టర్మినల్ ప్యానల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేనందుకు ప్రయత్నం చేస్తున్నారు. నిన్న రాత్రి పొద్దుపోయాక ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. మంటల్లో చిక్కుకున్నవారిలో 8మంది బయటకు వచ్చినప్పటికీ..9మంది మంటల్లోనే చిక్కుకున్నారు.వీరిలో DE శ్రీనివాస్ గౌడ్, AE నలుగురు సుందర్, మోహన్ కుమార్, సుస్మా, ఫాతిమా, వెంకట్ రావ్, ఎట్టి రాంబాబు, కిరణ్ లు ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది ఉన్నట్టు సమాచారం. మంత్రులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పొగ దట్టంగా అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది.