Asianet News TeluguAsianet News Telugu

సోషల్ మీడియాతో చెడే కాదు ఇలాంటి మంచి కూడా... సమాజ సేవకోసమే ఫేస్ బుక్ గ్రూప్

విజయవాడ: పేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ అంటే కొందరికి టైంపాస్... మరికొందరికి విద్వేషాలను రెచ్చగొట్టే మాధ్యమాలు... 

విజయవాడ: పేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ అంటే కొందరికి టైంపాస్... మరికొందరికి విద్వేషాలను రెచ్చగొట్టే మాధ్యమాలు... ఇలా సోషల్ మీడియా వల్లే చెడు జరుగుతుందని అపవాదు వుంది. కానీ ఇదే సోషల్ మీడియా మంచి పనులకూ ఉపయోగపడుతుందని నిరూపించాడు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన లంక రమేష్. ఇతడు మమతల పందిరి పేరిట ఫేస్ బుక్ గ్రూప్ ఓపెన్ చేసి అందులో సమాజసేవ చేయాలనే తపనవుండే వారిని సభ్యులుగా చేర్చుకున్నాడు. ఇలా దాదాపు 1500మంది ఈ గ్రూప్ లో చేరారు. వీరంతా వృద్ధులు, అనాధలు, వికలాంగులకు అహారం, దుస్తులు అందించటంతో పాటు పేదవారికి సాయం చేస్తున్నారు. ఒకరికి ఒకరు తెలియకున్నా సమాజ సేవ చేయాలన్న తపనే వీరందరిని కలిపింది. తాజాగా ఈ గ్రూప్ సభ్యులంతా వీరవల్లిలోని వాణీ విద్యానికేతన్ వేదికగా అత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేసుకుని కలుసుకున్నారు.