Asianet News TeluguAsianet News Telugu

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ : వెంకటాపురానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ ఆందోళన

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో వెంకటాపురం గ్రామానికి ప్రత్యేక ప్యాకేజీ కావాలని వెంకటాపురం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో వెంకటాపురం గ్రామానికి ప్రత్యేక ప్యాకేజీ కావాలని వెంకటాపురం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని, టెంపరరీ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని, గ్రామస్తులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని,సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ ఉన్న వెంకటాపురం గ్రామస్తులకు సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో అవకాశం కల్పించలేదని ఆందోళనకు దిగారు. అంతేకాదు ఎల్జీ పాలిమర్స్ వల్ల మొదటినుండీ వెంకటాపురం గ్రామమే ఎక్కువగా నష్టపోయిందని మిగతా గ్రామాలతోసమానంగావెంకటాపురాన్ని చూడడం సరికాదని అంటున్నారు. దీంతోపాటు 2 నెలలు కు సరిపడా నిత్యావసర సరుకులు కంపెనీ అందించాలని, ఆస్తి నష్టం ప్రాణ నష్టం వెంకటా పురం  గ్రామానికి ఎక్కువ అని ఆవేదన వ్యక్తం చేశారు.