కేసీఆర్ జాతీయ పార్టీలో ఏపీ నుండి మద్దతు... సివైఎఫ్ కీలక తీర్మానం

కాకినాడ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీకి మద్దతివ్వనున్నట్లు సివైఎఫ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ రెవరెండ్ మూర్తి రాజు ప్రకటించారు.

First Published Oct 4, 2022, 4:13 PM IST | Last Updated Oct 4, 2022, 4:13 PM IST

కాకినాడ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీకి మద్దతివ్వనున్నట్లు సివైఎఫ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ రెవరెండ్ మూర్తి రాజు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ పట్టణంలో జరిగిన క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ సమావేశంలో ఈ కీలక ప్రకటన చేసారు. నిన్న(సోమవారం) జరిగిన సీవైఎఫ్ బోర్డ్ మీటింగ్ లో కేసీఆర్ పెట్టే జాతీయపార్టీకి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు మూర్తి రాజు ప్రకటించారు. అసాధ్యమనేది లేకుండా అద్భుతాలు చేసే దేవుడు కేసీఆర్ కోరికను నెరవేర్చాలని సివైఎఫ్ కోరుకుంటోందని మూర్తి రాజు తెలిపారు. నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కోరుకున్న సమైక్యత, సమానత్వం గురించి కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని అన్నారు. అంబేద్కర్ అందరికీ మత, వాక్కు స్వేచ్చ అందిస్తే వీటిని కొన్నిపార్టీలు హరిస్తున్నాయి... అలాంటి వారికి మేల్కొల్పడానికి కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని అన్నారు. ఆయన కోరికను నెరవేర్చి... ఆలోచనలు సపలం అయ్యేలా చూడాలని కోరారు. కుల, మత ప్రసక్తి లేకుండా చూస్తూ మైనారిటీలకు అండగా వుండాలనే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని... ఆయనను ఆశీర్వదించాలి ప్రభువును కోరుకుంటున్నానని మూర్తి రాజు పేర్కొన్నారు.