ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో జనసేన... అభ్యర్థి ఎవరంటే?
మైలవరం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ బలపరచిన అభ్యర్థి గాదె వెంకటేశ్వరరావు పరిచయ కార్యక్రమం కృష్ణా జిల్లా మైలవరంలోని మారుతి కల్యాణ మండపంలో జరిగింది.
మైలవరం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ బలపరచిన అభ్యర్థి గాదె వెంకటేశ్వరరావు పరిచయ కార్యక్రమం కృష్ణా జిల్లా మైలవరంలోని మారుతి కల్యాణ మండపంలో జరిగింది. తనపై నమ్మకంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీకి నిలబెట్టిన అధినేత పవన్ కళ్యాణ్ కి, మద్దతు తెలిపిన జనసైనికులకి అభ్యర్థి గాదె వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.