
రేపల్లె పోలీస్ స్టేషన్లో ఎస్పీ విశాల్ గున్నీ ఆకస్మిక తనిఖీ
గుంటూరు: రేపల్లె పోలీస్ స్టేషన్ ను గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు.
గుంటూరు: రేపల్లె పోలీస్ స్టేషన్ ను గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు. స్టేషన్ లో పలు రికార్డులను తనిఖీ చేసి ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దని... అసాంఘిక కార్యక్రమాలు మీద సిబ్బంది ఫోకస్ పెట్టాలన్నారు. ముఖ్యంగా మహిళల కేసుల్లో వెంటనే స్పందించాలని అధికారులకు ఎస్పీ సూచించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
ప్రజలు కూడా ఏదయినా సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. ఏ సమస్య వున్నా స్థానిక పోలీసులకు... అవసరమయితే తనకు ఫోన్ చేసినా వెంటనే స్పందిస్తానని ఎస్పీ విశాల్ సూచించారు.