విజయవాడలో అగ్నిప్రమాదం... ఉవ్వెత్తును ఎగసిపడ్డ మంటలతో భయాందోళన

విజయవాడ : దీపావళి పండగపూట విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

First Published Oct 24, 2022, 10:22 AM IST | Last Updated Oct 24, 2022, 10:22 AM IST

విజయవాడ : దీపావళి పండగపూట విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గవర్నర్ పేటలో టపాసులు కాలుస్తుండగా నిప్పురవ్వలు పడి పలు దుకాణాలు అగ్గికి ఆహుతయ్యాయి.  పూజాసామాగ్రి(దేవుడి మందిరాలు) అమ్మే దుకాణాల్లో మంటలు చెలరేగి పక్కనే వున్న సోఫా తయారీ షాపులతో పాటు మరో రెండు దుకాణాలకు అంటుకున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదం రాత్రి సమయంలో జరగడం... షాపుల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసారు. కానీ అప్పటికే ఆరు షాపులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. మరిన్ని దుకాణాలను మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే అగ్నిప్రమాదం జరిగిన షాపుల్లో మాత్రం భారీగా ఆస్తినష్టం జరిగిందని యజమానులు వాపోతున్నారు.