Video news : పురుగుల మందు తాగి చనిపోవడానికి సిద్దమయ్యాను...
తన సమస్యను పరిష్కరించాలంటూ సంవత్సరకాలంగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నామంటూ నందిగామ మండలం మునగలచర్ల గ్రామానికి చెందిన భాస్కర రావు అనే రైతు కార్యాలయ సిబ్బంది ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు.
తన సమస్యను పరిష్కరించాలంటూ సంవత్సరకాలంగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నామంటూ నందిగామ మండలం మునగలచర్ల గ్రామానికి చెందిన భాస్కర రావు అనే రైతు కార్యాలయ సిబ్బంది ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. నందిగామ తాసిల్దార్ కార్యాలయంలో తమ భూమి వేరే వారికి ఎక్కించి తమను పక్కదోవ పట్టించి సంవత్సరాల తరబడి తిప్పించుకుంటున్నారని ఆవేదన చెండాడు. అన్ని పత్రాలు సక్రమంగా ఇచ్చిన మీ ఫైల్ కనపడుటలేదని మరల కొత్త ఫైల్ తమకు అప్లై చేసుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహానికి గురైన రైతు తాను పురుగుల మందు తాగి చనిపోవడానికి సిద్దం అయినట్లు తెలిపాడు.