నేలపాడులో భారీ క్రేన్ ఎక్కి రైతు ఆందోళన... అమరావతే రాజధాని అంటూ డిమాండ్..
మూడు రాజధానుల నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ వైపు హర్షాతిరేకాలు, మరోవైపు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
మూడు రాజధానుల నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ వైపు హర్షాతిరేకాలు, మరోవైపు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దండరాయునిపాలెంకు చెందిన దళిత రైతు పూర్ణ చంద్రరావు వినూత్న నిరసన చేపట్టాడు. నేలపాడులోని ఎన్టీవో టవర్ ను ఆనుకొని ఉన్న భారీ క్రేన్ పైకెక్కి అమరావతే రాజధానిగా ఉంచాలంటూ పులి పూర్ణచంద్రరావు డిమాండ్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని కిందికి దించారు