Asianet News TeluguAsianet News Telugu

విశాఖ ఏజెన్సీలో కరోనా టెన్షన్..

Jun 25, 2020, 11:06 AM IST

విశాఖ ఏజెన్సీలో కరోనా వ్యాపిస్తుండడంతో మారుమూల గ్రామాల్లోకి మైదాన ప్రాంత వ్యక్తులు రాకుండా చెట్లను నరికి రహదారికి అడ్డంగాపడేస్తున్నారు.  కొయ్యూరు మండలం బూదరాలలో రహదారికి అడ్డంగా చెట్లు నరికి పడేయడంతో ఆ రూట్లో పయనించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన్యం ప్రజలు కరోనా వైరస్ భయంతో ఆందోళనలో ఉన్నారు. విశాఖ మన్యంలో పలుచోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో వారపు సంత లు కూడా ఆపేశారు.