జాతీయ రహదారిపై కంటైనర్ లారీ బోల్తా... నిద్రమత్తే కారణమా?
విశాఖ కైలాసపురం పోర్ట్ హాస్పటల్ కూడలి జాతీయ రహదారిపై కంటైనర్ లారీ బోల్తా పడింది.
విశాఖ కైలాసపురం పోర్ట్ హాస్పటల్ కూడలి జాతీయ రహదారిపై కంటైనర్ లారీ బోల్తా పడింది. గురువారం ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో ఐరన్ "రోల్" లోడ్ తో ఒరిసా నుండి విశాఖ పోర్ట్ కు వెళ్తున్న కంటైనర్ లారీ అదుపు తప్పి ఒక్క సారిగా రహదారిపై బోల్తా పడింది. అయితే ప్రమాదంలో ప్రాణహాణి లేకపోవటంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. నిద్ర మత్తు వల్లే ప్రమాద జరిగి ఉండొచ్చని స్థానికులు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసు లు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమిక్షించారు.