సురేష్ ను కిరాతకంగా చంపిన చౌడేష్... విజయవాడ హత్యపై ఆందోళన

విజయవాడ  : పాత కక్షల నేపథ్యంలో ఎన్టీఆర్ జల్లా విజయవాడలో  దారుణ హత్య చోటుచేసుకుంది. 

Share this Video

విజయవాడ : పాత కక్షల నేపథ్యంలో ఎన్టీఆర్ జల్లా విజయవాడలో దారుణ హత్య చోటుచేసుకుంది. నగరంలోని మాచవరం ప్రాంతంలో కారుతో ఢీకొట్టి దేశీ సురేష్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా చంపాడు కంకణాల చౌడేష్. అమ్మా కళ్యాణమండపం వైపునుండి క్రీస్తురాజుపురం వైపు వెళుతున్న సురేశ్ ను మద్యంమత్తులో కారు నడుపుతూ ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టాడు చౌడేష్. దీంతో సురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ హత్యకు పాల్పడిన చౌడేష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అలాగే ఈ కేసులో కీలకంగా మారిన ఐ 20 కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చౌడేష్ ను కఠినంగా శిక్షించాలని మృతుడు సురేష్ కుటుంబం డిమాండ్ చేస్తోంది. 

Related Video