విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్ర చూడ్
విజయవాడ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్ర చూడ్ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.
విజయవాడ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్ర చూడ్ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్ర చూడ్ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన జస్టిస్ డి.వై. చంద్ర చూడ్ కు ఉపముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ హరి జవహర్ లాల్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి డి. భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనానికి తోడ్కొని వెళ్లారు. ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభంతో అమ్మవారి అంతరాలయానికి తీసుకువెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం వేదపండితులు జస్టిస్ డి.వై. చంద్ర చూడ్ కు ఆశీర్వచనాలను అందించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను, శేషవస్త్రాలను, చిత్రపటాన్ని అందచేశారు.