మా జోలికి వస్తే... కంచ ఐలయ్యకు పట్టిన గతే..: ఆర్య వైశ్య నాయకులు హెచ్చరిక

గుంటూరు: ప్రకాశం జిల్లాలో ఆర్యవైశ్య నాయకులు సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని శ్రీనివాసరావు అనుచరుడు సుభాని విచక్షణారహితంగా దాడి చేయడాన్ని ఆర్యవైశ్య నాయకులు ఖండించారు.

Share this Video

గుంటూరు: ప్రకాశం జిల్లాలో ఆర్యవైశ్య నాయకులు సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని శ్రీనివాసరావు అనుచరుడు సుభాని విచక్షణారహితంగా దాడి చేయడాన్ని ఆర్యవైశ్య నాయకులు ఖండించారు. ఇందుకు నిరసనగా గుంటూరు జిల్లా గురజాల పట్టణంలో ఆర్యవైశ్య నాయకులు ధర్నా చేపట్టారు. నాయకులంతా ర్యాలీగా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు.ఆర్యవైశ్య వర్గానికి చెందిన వైసిపి నాయకుడు సుబ్బారావుని అతి దారుణంగా దాడిచేయడం... మోకాళ్ళపై కూర్చోబెట్టి అవమానించడం అత్యంత దారుణమన్నారు. ఈ దాడికి పాల్పడిన సుభాని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. ఆర్యవైశ్యుల జోలికి వస్తే గతంలో కంచ ఐలయ్యకు ఎదురైన పరిస్థితే పునరావృతం అవుతుందని హెచ్చరించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video