బాబోయ్.. ఈ కల్లు కేంద్రం సెటప్ చూస్తే కళ్లు తిరగాల్సిందే..
కర్నూలు జిల్లా ఆదోనిలో కల్తీ కల్లు తయారీ కేంద్రాలపై పోలీసుల ఆకస్మిక దాడుల్లో కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగుచూశాయి.
కర్నూలు జిల్లా ఆదోనిలో కల్తీ కల్లు తయారీ కేంద్రాలపై పోలీసుల ఆకస్మిక దాడుల్లో కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగుచూశాయి. కల్లు తయారీ కేంద్రం లోపలే చేసిన సెటప్ ఆశ్చర్యపరిచింది. మత్తు పదార్థాలు, రసాయనాలు, డిటర్జెంట్ పౌడర్ వినియోగించి కల్తీ కల్లు తయారు చేస్తున్నారు. 25 కల్లు డ్రమ్ములు, వేలకొద్ది కల్లు సీసాలు పట్టుబడ్డాయి. కల్లు తయారీకి వాడే పౌడర్ కోసం ఏకంగా గిర్నీనే ఏర్పాటు చేసుకున్నారు. కల్లు తయారీ అడిషనల్ ఎస్పీ గౌతమ్శాలి పరిశీలించారు. 4,760 లీటర్ల కల్తీ కల్లు, 14 కేజీల క్లోరో హైడ్రేడ్, 49 కేజీల చక్కెర, డిటర్జెంట్ పౌడర్, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ కల్లు తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు.