మరో వివాదంలో రోజా... ఉద్యోగితో చెప్పులు మోయించిన మంత్రి...
బాపట్ల : ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె,. రోజా బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ను సందర్శించారు.
బాపట్ల : ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె,. రోజా బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ను సందర్శించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత బీచ్ రిసార్ట్ ను సందర్శించిన మంత్రి అతిథి గృహలు, సమావేశ మందిరం, పర్యాటకులకు కల్పించే సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రిసార్ట్ సిబ్బంది, అధికారులతో కలిసి రోజా సముద్ర తీరానికి వెళ్లారు. ఈ క్రమంలోనే చెప్పులను వదిలి సముద్ర జలాల్లోకి దిగగా... ఆమె సహాయకులు చెప్పులను జాగ్రత్తగా చూడాలని రిసార్ట్ ఉద్యోగికి సూచించారు. దీంతో ఆ చిరుద్యోగి మంత్రి చెప్పులను చేత్తో మోస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ మంత్రి రోజా వ్యవహారతీరు వివాదాస్పదంగా మారింది,
ఇదిలావుంటే సూర్యలంక బీచ్ అందాలను మంత్రి రోజా ఆస్వాదించారు. చలువ కళ్లద్దాలు ధరించి జలాల్లోకి దిగిన మంత్రి రోజా సముద్ర అందాలను చూస్తూ ఉండిపోయారు. ఈ బీచ్ ను మరింత ఆహ్లాదరకంగా తయారుచేస్తామని... ఆ దిశగా త్వరలోనే పనులు ప్రారంభిస్తామని రోజా అన్నారు.