Asianet News TeluguAsianet News Telugu

శభాష్ తల్లీ... బాల్య వివాహాన్ని ఎదిరించి భలే ర్యాంక్ సాధించావ్...

కర్నూల్ : చదువు విలువేంటో ఆమెకు  తెలుసు. తన కాళ్లపై తాను నిలబడాలంటే చదువొక్కటే మార్గమని గుర్తించింది. 

కర్నూల్ : చదువు విలువేంటో ఆమెకు  తెలుసు. తన కాళ్లపై తాను నిలబడాలంటే చదువొక్కటే మార్గమని గుర్తించింది. అందుకు తగ్గట్లుగానే బాగా చదివేది. కానీ ఆ బాలిక తల్లిదండ్రులు మాత్రం చాలామంది పేరెంట్స్ లాగే కూతుర్ని భారంగా భావించారో ఏమోగానీ చదువు మాన్పించి పెళ్లి చేయడానికి సిద్దమయ్యారు. కానీ బాల్య వివాహాన్ని ధైర్యంగా ఎదిరించిన బాలిక చదువు కొనసాగించింది.ఇలా ఎన్నోసవాళ్ల మధ్య చదువుకుంటున్న ఆ బాలిక తాజాగా వెలువడ్డ ఇంటర్మీడియట్ ఫలితాల్లో టాపర్ గా నిలిచింది.  ఇలా చదువుల సరస్వతిగా నిలిచి మహిళా లోకానికే ఆదర్శంగా నిలిచింది ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఈ బాలిక.