Asianet News TeluguAsianet News Telugu

Video: స్టెప్పులతో అదరగొట్టిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు నృత్యప్రదర్శనతో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణికి ఇతర అతిథులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థినులు డిప్యూటీ సీఎంను డ్యాన్స్ చేయాల్సిందిగా పట్టుబట్టారు.

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విద్యార్థినులతో కలిసి నృత్యం చేశారు. ఒక పదినిమిషాలపాటు నృత్యం చేసి విద్యార్థుల్లో ఆనందం నింపారు. డిప్యూటీ సీఎంతోపాటు పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మీ సైతం మంత్రికి తోడుగా కాలు కదిపారు. 

సంగీతానికి తగ్గట్లుగా స్టెప్పులు వేస్తూ పాముల పుష్పశ్రీవాణి అదరహో అనిపించారు. పుష్పశ్రీవాణి స్టెప్పులేస్తున్నంత సేపు విద్యార్థులు విజిల్స్ మోత మోగించారు.