విజయవాడలో చిచ్చురేపిన టిక్ టాక్

టిక్‌టాక్ ద్వారా పరిచయమైన ఓ మహిళను ఓ వ్యక్తి వివాహం చేసుకొన్నాడు. అయితే తనకు పెళ్లైన విసయాన్ని దాచిపెట్టి మరో పెళ్లి చేసుకొన్నాడు. అంతేకాదు రెండో పెళ్లి విషయం తెలుసుకొన్న మొదటి  భార్యను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు.

Share this Video

టిక్‌టాక్ ద్వారా పరిచయమైన ఓ మహిళను ఓ వ్యక్తి వివాహం చేసుకొన్నాడు. అయితే తనకు పెళ్లైన విసయాన్ని దాచిపెట్టి మరో పెళ్లి చేసుకొన్నాడు. అంతేకాదు రెండో పెళ్లి విషయం తెలుసుకొన్న మొదటి భార్యను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ విషయం తెలుసుకొన్న మొదటి భార్య అతనిపై కేసు పెట్టింది. ఈ ఘటన కృష్ణా జిల్లా విజయవాడలో చోటు చేసుకొంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో వీటీపీఎస్‌లో సత్యరాజ్ పనిచేస్తున్నాడు. సత్యరాజ్‌కు పెళ్లైంది. కానీ, సత్యరాజ్ మాత్రం తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టాడు. ఏడాదిగా టిక్ టాక్ చేస్తున్న సమయంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఏడాదిగా ఆ మహిళతో టిక్ టాక్ వీడియోలు చేసేవాడు.

టిక్ టాక్‌లో పరిచయం ఉన్న మహిళను సత్యరాజ్‌ ఇటీవలనే తిరుపతిలో పెళ్లి చేసుకొన్నాడు. భర్త సత్యరాజ్ ప్రవర్తనలో మార్పు వచ్చిన విషయాన్ని భార్య అనురాధ గుర్తించింది. ఇదే విషయాన్ని భర్తను నిలదీసింది. అతను సమాధానం ఇవ్వలేదు.

Related Video