Asianet News TeluguAsianet News Telugu

ఏపీ రాజధాని రచ్చ : లాఠీఛార్జ్ లకు నిరసనగా.. నేడు అమరావతి బంద్...

Jan 21, 2020, 12:14 PM IST

నిన్న రైతులపై, మహిళలపై జరిగిన పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా అమరావతి ఐకాస బంద్‌కు పిలుపునిచ్చింది. రాజధానిలోని 29 గ్రామాలు బంద్‌ పాటిస్తున్నాయి. రాజధాని గ్రామాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. బంద్ నేపథ్యంలో తుళ్ళూరులో పోలీస్ బలగాలు భారీగా మోహరించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 35వ రోజుకు చేరుకున్నాయి.