జ్వరం, జలుబు, దగ్గు ఉంటే కరోనా కానక్కరలేదు.. ఎయిమ్స్ డైరెక్టర్ ముఖేష్ త్రిపాఠీ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహమ్మారి గురించి ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ముఖేష్ త్రిపాఠి అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహమ్మారి గురించి ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ముఖేష్ త్రిపాఠి అన్నారు. కరోనాపై దేశ వ్యాప్తంగా వైద్య రంగం అప్రమత్తంగా ఉందన్నారు. అంతేకాదు జ్వరం, దగ్గు, లక్షణాలు ఉన్నట్లయితే ముందుగా వైరల్ ఫీవర్ పరీక్ష చేసుకుని అనంతరం అవసరాన్ని బట్టి కరోనా పరీక్షలు చేయించుకోవడం మంచిదని తెలిపారు. బాధితులకు సహాయం చేయడానికి ఎయిమ్స్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని తెలిపారు.