షిప్ యార్డ్ ప్రమాదంలో పదకొండుకు చేరిన మృతుల సంఖ్య..
విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పదకొడుకు చేరింది.
విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పదకొడుకు చేరింది. రెండేళ్ల క్రితం కమిషనింగ్ లో జెట్టీ క్రేన్ సేవలు మొదలయ్యాయని దాని ఆపరేషన్స్ కోసం ట్రయల్ రన్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని తెలిపారు. క్యాబిన్ లో ఉన్న పదకొండుమంది చనిపోయారని, ఎవ్వరికీ గాయాలు కాలేదని అన్నారు. చనిపోయిన వారిలో గ్రీన్ ఫీల్డ్ వాళ్లు ముగ్గురు, లీడ్ ఇంజనీర్స్ నుండి ఇద్దరు, స్క్వాడ్ సెవన్ నుండి ఒకరు వీళ్లు ఆరుగురు. నలుగురు షిప్ యార్డ్ సిబ్బంది. ఒకరు సూపర్ వైజర్, ముగ్గరు వర్క్ మన్ ఉన్నారు. వీరు కాకుండా మరో వ్యక్తి మృతదేహం క్రేన్ కింద ఉంది. ఈ పదకొండు మంది విశాఖకు చెందినవారే అని తెలుస్తోంది.