తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారంతో ప్రచార గడువు ముగియనుండటంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు వీడియో సందేశం పంపారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష నెరవేరాలని.. ఈ ప్రేమ , అభిమానాలకు తాను ఎప్పటికీ రుణపడి వుంటానని సోనియా గాంధీ స్పష్టం చేశారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారంతో ప్రచార గడువు ముగియనుండటంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు వీడియో సందేశం పంపారు. దొరల తెలంగాణను, ప్రజల తెలంగాణగా మారుద్దామని ఆమె పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలని, నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సోనియా గాంధీ సూచించారు. తెలంగాణ ప్రజల మధ్యకు రాలేకపోయానని.. కానీ ప్రజల హృదయాలకు చాలా దగ్గరయ్యానని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. మార్పు కోసం ఓటేయ్యాలని.. నన్ను సోనియమ్మ అని పిలిచి నాకు గౌరవమిచ్చారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష నెరవేరాలని.. ఈ ప్రేమ , అభిమానాలకు తాను ఎప్పటికీ రుణపడి వుంటానని సోనియా గాంధీ స్పష్టం చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Scroll to load tweet…