2000 రూపాయల నోట్లను గతంలోనే ఎక్కువ ముద్రించకూడదని ఆర్‌బీఐ నిర్ణయించింది. నిజానికి గతంలో 500, 1000 నోట్ల రద్దు తర్వాత నవంబర్ 2016లో ఈ రూ.2000 నోట్లను ప్రవేశపెట్టారు. ఇవి త్వరగా సిస్టమ్ నుంచి చెలామణిలో లేకుండా పోయాయి. ఈ నోట్లను ముద్రించే ఉద్దేశ్యం నెరవేరిందని ఈ సందర్బంగా సెంట్రల్ బ్యాంక్ విశ్వసిస్తోంది.