Rs. 2000 Note: నా దగ్గర 2000 రూాపాయల నోట్లు ఉన్నాయి, అవి ఇక చెల్లవా, ఇలాంటి అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇవే

2000 రూపాయల నోట్లను గతంలోనే ఎక్కువ ముద్రించకూడదని ఆర్‌బీఐ నిర్ణయించింది. నిజానికి గతంలో 500, 1000 నోట్ల రద్దు తర్వాత నవంబర్ 2016లో ఈ రూ.2000 నోట్లను ప్రవేశపెట్టారు. ఇవి త్వరగా సిస్టమ్ నుంచి చెలామణిలో లేకుండా పోయాయి. ఈ నోట్లను ముద్రించే ఉద్దేశ్యం నెరవేరిందని ఈ సందర్బంగా సెంట్రల్ బ్యాంక్ విశ్వసిస్తోంది.

Rs. 2000 Note: I have 2000 rupees notes, are they valid anymore, answers to all such questions MKA

2000 రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లు చెలామణి నుండి ఉపసంహరించుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  తాజాగా ప్రకటించింది. అంటే 2000 రూపాయల నోటు చలామణిలో ఉండటం లేదు. ఈ వార్త విన్న తర్వాత చాలామంది వ్యాపారస్తులు అదే విధంగా సామాన్యులు సైతం కంగారు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా 2000 రూపాయల నోట్లను కలిగి ఉన్న వ్యాపారస్తులు ఆందోళన చెందటం సహజమే. అయితే మీరు కూడా ఉంటే ఆందోళన చెందాల్సిన పనిలేదు. నోట్ల రద్దు వల్ల 2000 నోటుకు రాత్రికి రాత్రి విలువ పోయినట్లు కాదు. అనే విషయం గుర్తుంచుకోవాలి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రజలు వాటిని మార్చుకోవడానికి తగినంత సమయం ఇస్తుంది. రండి, దానికి సంబంధించిన మనస్సులో తలెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. 

నా దగ్గర 2000 రూపాయల నోట్లు ఉన్నాయి. ఇప్పుడు వాటిని  ఏం చేయాలి?

మీ వద్ద 2000 రూపాయల నోట్లు ఉంటే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు వాటిని మీ సౌలభ్యం ప్రకారం మార్చుకోవచ్చు. ఇందుకు ఆర్‌బీఐ తగిన సమయం ఇచ్చింది.

2000 రూపాయల నోటు ఇప్పుడు చెలామణి అవుతుందా…లేదా?

2000 రూపాయల నోటు పూర్తిగా చట్టబద్ధమైనదే…ఇది ఇప్పుడు కూడా సిస్టమ్‌లో రన్ అవుతుంది. కానీ, ఇప్పుడు ఎవరైనా దానిని లావాదేవీలో తీసుకోవాలనుకోరు. కారణం వీటిని వేరే నోట్లతో భర్తీ చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు ఈ ఇబ్బందులను నివారించడానికి రూ. 2000 నోట్లను తీసుకోకుండా ఉండవచ్చు.

నేను 2000 రూపాయల నోట్లను ఎక్కడ మార్చుకోవాలి?

2000 రూపాయల నోటును ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. అంటే, మీ ఖాతా స్టేట్ ఆఫ్ ఇండియా (SBI)లో ఉండి, మీ ఇంటికి సమీపంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఉంటే, మీరు PNBకి వెళ్లి కూడా 2000 రూపాయల నోటును మార్చుకోవచ్చు. మరో మాటలో చెప్పాలంటే, నోట్లను మార్చుకోవడానికి నిర్దిష్ట బ్యాంకుకు వెళ్లవలసిన అవసరం ఉండదు. ఏదైనా బ్యాంకును సందర్శించడం ద్వారా వీటిని మార్చుకోవచ్చు.

నేను నా రూ.2000 నోట్లను ఎప్పటి నుంచి మార్చుకోగలను?

2023 మే 23 నుంచి 2000 రూపాయల నోట్లను మార్చుకునే పనిని బ్యాంకులు ప్రారంభిస్తాయి. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, ఈ నోట్లను బ్యాంకు పని వేళల్లో ఎప్పుడైనా మార్చుకోవచ్చు.

నేను ఒకేసారి ఎన్ని 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు?

బ్యాంక్ సాధారణ పనితీరుకు అంతరాయం కలగకుండా చూసేందుకు, ఒకేసారి రూ.20,000 పరిమితిని నిర్ణయించారు. అంటే, మే 23, 2023 నుండి, మీరు రూ.2000 నోట్లను ఒకేసారి రూ.20,000 వరకు మార్చుకోవచ్చు.

నేను నా రూ. 2000 నోటును ఎప్పటి వరకు మార్చుకోగలను?

మీ రూ. 2000 నోటును మార్చుకోవడానికి మీకు తగినంత సమయం ఉంటుంది. అందువల్ల, ఎలాంటి తొందరపాటు అవసరం లేదు. 2023 సెప్టెంబర్ 30 వరకు 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. అంటే ఈ నోట్ల మార్పిడికి మే 23 నుంచి సెప్టెంబర్ వరకు సమయం ఉంటుంది.

ఇది డీమోనిటైజేషన్‌నా?

ఇది డీమోనిటైజేషన్ కాదు. 2000 రూపాయల నోట్లు పూర్తిగా చెల్లుబాటు అవుతాయి. వాటిని రద్దు చేయడం లేదు. అయితే, దానిని సిస్టమ్ నుండి తీసివేయడానికి రీఫండ్ చేస్తున్నారు. వాటిని ముద్రించిన ప్రయోజనం ఇప్పుడు నెరవేరిందని ఆర్‌బీఐ భావిస్తోంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios