పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఫలితాల సరళిలో ఆప్ ముందంజలో ఉన్నది. పంజాబ్‌లో ఆప్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేస్తే.. ఆ మార్పు కేవలం పంజాబ్‌కే పరిమితం కాబోదని, దేశ రాజకీయాలపైనా దాని ప్రభావం బలంగా ఉంటుందని అంచనాలు వస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో ఆప్ ఒక ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.