Shimla: హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సిమ్లాలోని ఓ రెస్టారెంట్ లో మంగళవారం సాయంత్రం సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని సిమ్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ కుమార్ గాంధీ తెలిపారు.