Chemical factory blast: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభ‌వించ‌డంతో న‌లుగురు మ‌ర‌ణించారు. మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్దారు. రసాయనాల ఉష్ణోగ్రత పెరగడం పేలుడుకు ఒక కారణమై ఉండవచ్చనీ, అయితే ఫోరెన్సిక్ నివేదిక సమర్పించి, దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయ‌ని పోలీసులు తెలిపారు.  

Surat Chemical factory blast: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభ‌వించ‌డంతో న‌లుగురు మ‌ర‌ణించారు. మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్దారు. క్ష‌తగాత్రుల‌ను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. రసాయనాల ఉష్ణోగ్రత పెరగడం పేలుడుకు ఒక కారణమై ఉండవచ్చని, అయితే ఫోరెన్సిక్ నివేదిక సమర్పించి, దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయ‌ని పోలీసులు తెలిపారు. ఈ ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి కార‌ణాల‌పై ద‌ర్యాప్తు జ‌రుగుతున్న‌ద‌ని వెల్ల‌డించారు. ఈ ఘోర ఘ‌ట‌న గుజరాత్ లో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సూరత్ నగరంలో ప్రమాదకర రసాయనాలను నిల్వ చేసే కంటైనర్‌లో భారీ పేలుడు సంభవించడంతో నలుగురు కార్మికులు మరణించగా, 20 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సచిన్ గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (జీఐడీసీ) ప్రాంతంలో ఉన్న అనుపమ్ రసాయాన్ ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగిందని సూరత్ ఇన్‌ఛార్జ్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పరీక్ తెలిపారు. “మేము నిన్న రాత్రి (శ‌నివారం) ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాము. ఈ రోజు ఉదయం (ఆదివారం) మరో మూడు మృతదేహాలను అదే స్థలం నుండి స్వాధీనం చేసుకున్నాము. మరో ఇరవై మంది తీవ్రంగా  గాయపడ్డారు. క్ష‌త‌గాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు”అని సచిన్ జీఐడీసీ పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసు ఇన్‌స్పెక్టర్ డీవీ బల్దానియా ఆదివారం తెలిపారు.

బాధితుల వాంగ్మూలాలను బట్టి చూస్తే రసాయనం అధిక ఉష్ణోగ్రత పేలుడుకు దారితీసినట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. అయితే,  ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదిక సమర్పించి, ఇతర పరిశోధనలు పూర్తయిన తర్వాతే మరిన్ని పూర్తి వివరాలు తెలుస్తాయ‌ని ఆయ‌న అన్నారు. “పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇంకా కనుగొనబడలేదు. పేలుడుకు దారితీసే రసాయనాన్ని కంటైనర్‌లో నింపారు. ఉష్ణోగ్రత పెరగడం పేలుడు వెనుక ఒక కారణం కావచ్చు, అయితే మరిన్ని వివరాల కోసం మేము వేచివున్నాము. దీనికి సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ వేబొరేట‌రీ రిపోర్టులు అందాల్సి ఉంది. పోలీసుల ద‌ర్యాప్తు కూడా కొన‌సాగుతున్న‌ద‌ని ”అని పోలీసు ఉన్న‌తాధికారులు తెలిపారు.