చిత్తూరు: మదనపల్లె సమీపంలోని గట్టు గ్రామంలో ఓ కామాంధుడి చేతిలో వర్షిణి అనే చిన్నారి బాలికను ఓ కామాంధుడు పొట్టనబెట్టుకున్నాడు. పెళ్లింటినుండి బాలికను అపహరించుకుపోయిన దుండగుడు అభం శుభం తెలియని బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశాడు. ఆ దుర్ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.

ఇలా తమ కూతురు దారుణ హత్యకు గురవడంతో తల్లిదండ్రులు కన్నీరు మన్నీరుగా విలపిస్తున్నారు. కన్న కూతురిని  కోల్పోయి పుట్టెడు బాధలో వున్నవారిని రాష్ట్ర  మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ
 పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పి అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితున్ని ఎట్టి పరిస్థితుల్లో  వదిలిపెట్టబోమని... కఠనంగా శిక్షిస్తామని తెలిపారు. 

read more  పెళ్లింట విషాదం.. ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య

ఆ ఘటనపై వాసిరెడ్డి  పద్మ  మాట్లాడుతూ... బాలికను అపహరించి అత్యాచారానికి  పాల్పడ్డ నిందితుడు ఇలాంటి నేరాలు చేయడంలో ఆరితేరిన వాడని అర్థమవుతోందన్నారు. 
సిసి ఫుటేజి ఆధారంగా అనుమానితుడిని వ్యవహారశైలి గమనిస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోందన్నారు. 

వందలాదిమంది మద్యలో ఏలాంటి జంకూ లేకుండా బాలికను నిందితుడు ట్రాప్ చేయడం విచిత్రంగా వుందన్నారు. నిందితుడు ఇతర రాష్ట్రానికి చెందిన వాడై ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు.

నిందితుడు ఎవరైనా..ఎక్కడ దాక్కున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు. మళ్ళీ ఇలాంటి అఘాయిత్యాలకు ఎవరు పాల్పడాలని చూసినా...కనీసం ఆలోచన వచ్చినా భయం పుట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు.  చట్టాలను అనుసరించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 

ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ కు కూడా సవివరంగా తెలియపరచినట్లు పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును పలు కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపినట్లు వెల్లడించారు. వివిధరాష్ట్రాల సహకారంతో విచారణ ముమ్మరం చేయిస్తామమని వాసి రెడ్డి పద్మ పేర్కొన్నారు. 

read more  నా గురించి వాగితే ఖబర్దార్...దేవినేని ఉమకు వైసిపి ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది.   పూర్తి వివరాల్లోకి వెళితే...  బి.కొత్తకోట మండలం గట్టు గ్రామం గుట్ట పాలెం కు చెందిన రైతు సిద్ధారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి చేనేత నగర్ లో పెళ్లికి వచ్చారు. సిద్ధారెడ్డికి ఐదేళ్ల వర్షిణి అనే కుమార్తె ఉంది. ఆమెను కూడా పెళ్లికి తీసుకువచ్చారు.

కాగా...అప్పటి వరకు తమతోనే ఉన్న చిన్నారిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.  దీంతో చిన్నారి కోసం తల్లిదండ్రులు చుట్టుపక్కల మొత్తం గాలించారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో... గురువారం రాత్రి  చిన్నారి వర్షిణి  కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. శుక్రవారం తెల్లవారుజామున కళ్యాణ మండపం వద్ద వర్షిణి విగతజీవిగా పడి ఉంది.

చిన్నారిని హత్య చేసి అక్కడ పడేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలికపై అత్యాచారం జరిపి ఆ తర్వాత హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.