పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో.. చావు వార్త వినపడింది. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఆటలాడుతూ.. నవ్వుతూ తిరిగిన చిన్నారి ఒక్కసారిగా శవంగా మారింది. ఆరేళ్ల చిన్నారిని అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది.   పూర్తి వివరాల్లోకి వెళితే...  బి.కొత్తకోట మండలం గట్టు గ్రామం గుట్ట పాలెం కు చెందిన రైతు సిద్ధారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి చేనేత నగర్ లో పెళ్లికి వచ్చారు. సిద్ధారెడ్డికి ఐదేళ్ల వర్షిణి అనే కుమార్తె ఉంది. ఆమెను కూడా పెళ్లికి తీసుకువచ్చారు.

కాగా...అప్పటి వరకు తమతోనే ఉన్న చిన్నారిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.  దీంతో చిన్నారి కోసం తల్లిదండ్రులు చుట్టుపక్కల మొత్తం గాలించారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో... గురువారం రాత్రి  చిన్నారి వర్షిణి  కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. శుక్రవారం తెల్లవారుజామున కళ్యాణ మండపం వద్ద వర్షిణి విగతజీవిగా పడి ఉంది.

చిన్నారిని హత్య చేసి అక్కడ పడేసినట్లు పోలీసులు గుర్తించారు. అత్యాచారం జరిగి ఉంటుందా అనే అనుమమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.