తిరుపతి నగరంలోని గోవింద రాజస్వామి ఆర్ట్స్ కళాశాల వసతి గృహంలో ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ బాత్‌రూమ్‌లో పెట్రోల్ పోసుకుని అగ్నికి ఆహుతయ్యాడు. మూడు పేజీల లేఖ రాసి ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టిస్తోంది. 

ఈ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి అనంతపురం జిల్లా చెర్లోపల్లి మండలం మద్దిపల్లికి చెందిన వేణుగోపాల్‌గా పోలీసులు గుర్తించారు. వేణుగోపాల్ రూంలో ఓ సూసైడ్‌ నోట్‌ను పోలీసులు గుర్తించారు. ఇందులో అతడు పేర్కొన్న విషయాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. 

''ఫ్రెండ్స్ కోసం నేను ఏమీ చేయలేదు అన్నావ్ కదరా.. నా ప్రాణం ఇస్తున్నారా.. సరిపోతుందా?’ అంటూ సూసైడ్ లెటర్ లో వేణుగోపాల్ పేర్కొన్నాడు. మూడు పేజీల సూసైడ్ నోట్‌లో ఇంకా ఏముందంటే...‘‘సారీరా నాని(హేమంత్). నేను తప్పు చేశాను. ఆ అమ్మాయిని అనడం నా తప్పు. నేను ఎన్సీసీలో రెస్పెక్ట్ ఇవ్వలేదురా సారీరా. జై హింద్ సీనియర్.. జై హింద్ సీనియర్..జై హింద్ సీనియర్.. చాలారా.

read more  ఇసుక కొరత: తెనాలిలో మరో భవన నిర్మాణ కార్మికుడి ఆత్మహత్య

రేయ్ నాని ఆ అమ్మాయి వల్ల నన్ను వద్దన్నావ్ కదరా. నేను తప్పు చేశానురా క్షమించు. రేయ్ నా బర్త్ డే ఫస్ట్ ఇయర్‌లో చేసింది నువ్వేరా మర్చిపోయావా. మనం ఎన్సీసీలో పరిచయం అయ్యాం. ఎన్సీసీలో, క్యాంపస్‌లో, హాస్టల్‌లో, బయటా మనం తిరిగినవి గుర్తులేదారా?. నువ్వు అన్నావుగా.. ఫ్రెండ్స్ కోసం ఏం చేశావ్ అని.. నిజంగా నేను ఏమీ చేయలేదురా. అందుకే నా ప్రాణం ఇస్తున్నా. సరిపోతుందారా?

మన ఫ్రెండ్స్‌ అందరితో మాట్లాడొద్దన్నావట కదరా. వాళ్లను నువ్వే పరిచయం చేశావు. నువ్వే మాట్లాడొద్దు అన్నావు. నాతో మాట్లాడడం లేదని నువ్వు మీ ఇంట్లో చెప్పావు. నీ మనసు చంపుకోవద్దురా. నేను ఉండను. సరేరా నేను ఎవడిని నీకు అంతేగా.. నేను నీకు ఏం చేశాను.

దిలీప్ సారీరా.. నేను నీతో ఆ రోజు తప్పుగా మాట్లాడాను. మనవాళ్లు అని అనుకుంటారని మాట్లాడాను. నువ్వు ఆరోజు నుంచి నన్ను పట్టించుకోవడం లేదు. రేయ్ నాని హాలీడేస్‌లో మా ఇంటి కన్నా మీ ఇంటికే ఎక్కువ వచ్చాను కదరా.. మీ ఇంట్లోనేగా నేను ఉంది. నువ్వు ఉన్నావనే కదా నేను వచ్చింది. నాకు తెలిసి నువ్వు ఇప్పుడే అందరితో హ్యాపీగా ఉన్నావనుకుంటా.

read more ఎమ్మెల్యేఆర్కేవెంటనే రాజీనామా చేయాలి...: లోకేశ్ డిమాండ్

ఇంక కొత్తగా అమ్మాయిలు పరిచయం అయ్యారు కదా. అందరూ హ్యాపీగా ఉండండి. నేను సింగిల్‌గా ఉండడం నీకు హ్యాపీగా ఉంటుంది కదా. నాతో మాట్లాడొద్దని మన ఫ్రెండ్స్‌కు కూడా చెప్పావు కదా. నేను నీతో తప్పుగా మాట్లాడానురా.. సారీ. నా శవాన్ని చూడ్డానికైనా వస్తావా రా. అన్నీ వదులుకున్నారా. నా ప్రాణాలే వదులుతున్నా.. ఎవరైనా లవర్ కోసం ప్రాణాలు వదులుకుంటారో లేదో తెలియదు కానీ నేను ఫ్రెండ్స్ కోసం వదులుకుంటానురా. 

మన ఫ్రెండ్స్ మాట్లాడకపోతే నేను రూమ్‌లో ఒంటరిగా హ్యాపీగా ఉంటాననుకున్నావు కదా. చచ్చిపోయానురా.. ఈ 3 నెలలు నువ్వు మాట్లాడక చచ్చిపోయాను. నానీ.. మీ  అమ్మానాన్నలకు సారీ చెప్పానని చెప్పు.  

మా అమ్మానాన్నలు నా కోసం చాలా చేశారు. నా కోసం మా అన్నయ్య తన చదువును వదులుకున్నాడు. నువ్వు ఎందుకు చదువుకోవు అని ఇంట్లోవాళ్లు అడిగితే నా తమ్ముడు ఉన్నాడుగా అనేవాడు.

నా జీవితంలో ఫ్రెండ్స్ ఉన్నారంటే అది మీరేరా.. నాని, క్రాంతి, వెంకీ, దిలీప్, చంద్ర, సాయి, విష్ణు.. మీరు చాలా ఇచ్చారు. మీ కోసం నా ప్రాణం చాలారా. మీరంతా బాగా చదువుకుని లైఫ్‌లో ఒక రేంజ్‌లో ఉండాలని కోరుకుంటూ మీ ఫ్రెండ్ వేణు. నాలా ఏ ఫ్రెండ్‌‌కూ జరగకూడదు.’’ అంటూ వేణుగోపాల్‌ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు.