దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ  నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత కూడా మగాళ్లలో మార్పు రావడం లేదు. ఒంటరి అమ్మాయిలను ఈ మృగాళ్ల ఆగడాలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. 

ఆద్యాత్మిక నగరం తిరుపతి సమీపంలో ముళ్ళపూడిలో అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికపై మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. 16 ఏళ్ళ మైనర్ బాలికను ఇద్దరు యువకులు అత్యంత పాశవికంగా లైంగిక దాడికి దిగారు. లిఫ్ట్ ఇస్తామని నమ్మించి బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన దుండగులు  రోడ్డుపక్కన ముళ్ళపొదల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన తిరుచానూరు పోలీసులు ముద్దాయిలను అరెస్ట్ చేశారు.

తిరుపతి రూరల్ మండలం బ్రహ్మణపట్టుకు చెందిన వెంకటేష్, పద్మావతిపురంకు చెందిన రాజమోహన్ నాయక్ లు స్నేహితులు. వీరిద్దరు కలిసి గత నెలలో  అర్థరాత్రి ఓ మైనర్ బాలికను అత్యాచారం చేసినట్లు డిఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.

read more  డిగ్రీ చదువుతున్న ఓ యువతి..

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నవంబర్ 24వ తేదీ రాత్రి పద్మావతిపురం వద్ద బైక్ పై వెళుతున్న వెంకటేష్ ను బాదిత బాలిక లిఫ్ట్ అడిగింది. దీంతో వెంకటేష్ తిరుచానూరు వరకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్ ఆపకుండా ముళ్ళపూడికి తీసుకెళ్ళాడు. 

బండికి పెట్రోల్ అయిపోయిందని బాలికను నమ్మించి తన స్నేహితుడు రాజా మోహన్ నాయక్ కు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. అనంతరం ఇద్దరు కలిసి బాలికను బలవంతంగా ముళ్లపొదళ్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసారు. 

ఈ దాడి అనంతరం ఇంటికి  చేరుకున్న బాలిక తనపై జరిగని  అఘాయిత్యం గురించి తల్లిదండ్రుల  తెలిపింది. దీంతో వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు జరిపి నిందితులను అరెస్ట్ చేశారు.  

read more బ్యాంక్ ఉద్యోగమే పెట్టుబడి... యువతుల జీవితాలతో ఆడుకుంటున్న నిత్యపెళ్లికొడుకు జైలుపాలు

నిందితుడు రాజా మోహన్ నాయక్ ఓ హత్య కేసులో ముద్దాయిగా గుర్తించామని ఆయన చెప్పారు. అత్యాచార సంఘటనలో ముద్దాయిలు ఉపయోగించిన బైక్స్ కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని డిఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు.