ఒకరితో నిశ్చితార్థం మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధ పడ్డ ప్రభుద్దుడికి డి బాగోతం బయటపడింది. మొదట నిశ్చితార్థం చేసుకున్న యువతి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన కర్నూలు జిల్లా నంద్యాల లో సంచలనం సృష్టించింది.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  కర్నూలు కు చెందిన మోహన్ క్రిష్ణ తిరుపతి ఎస్‌బిఐ బ్రాంచిలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. రూ.16 లక్షల కట్నం ముందే తీసుకుని నాలుగు నెలల క్రితం తిరుపతికి చెందిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని ఆ తర్వాత వారికి కనిపించడం మానేశాడు.అమ్మాయి తల్లిదండ్రులు బ్యాంకులో విచారించగా సెలవుపై వెళ్ళాడని సమాచారం వచ్చింది.

మోహన్ క్రిష్ణ తీరును అనుమానించి అమ్మాయి తరపువారు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీన్ కట్ చేస్తే ఈ ప్రబుద్ధుడు నాలుగు రోజుల క్రితం నంద్యాలలో ప్రత్యక్షమయ్యాడు. తల్లితండ్రి లేని యువతి బంధువులను కలిసి తాను బ్యాంకు ఉద్యోగిని అని చెప్పి నయవంచనకు తెరదీశాడు.అమ్మాయి బంధువులు ఈ మోసగాడి మాటలు నమ్మి 12 లక్షలు కట్నంగా ఇచ్చేందుకు సిద్ధపడ్డారు.

read more  తిరుమలలో అగ్నిప్రమాదం: బూంది పోటులో చెలరేగిన మంటలు

గతంలో తనకు నిశ్చితార్థం అయ్యిందని అమ్మాయి జాతకం బాగోలేదని వదిలేసుకున్నామని చెప్పి వారిని నమ్మించాడు. అలాగే పెళ్లి అర్జంట్ గా జరగాలని ఫోటోలు వీడియోలు తీయరాదని వారిని కోరాడు. అన్నింటికి తలాడించిన అమ్మాయి బంధువులు గుట్టు చప్పుడు కాకుండా డిసెంబర్ 8న నంద్యాల బ్రహ్మానందీశ్వర స్వామి ఆలయంలో వివాహ ఏర్పాట్లు చేశారు.

నిశ్చితార్థం చేసుకొని కట్నం ముందే తీసుకున్న విషయం మాత్రం ఈ ప్రబుద్ధుడు దాచిపెట్టాడు.ఈ లోపు నంద్యాలలో వివాహం చేసుకుంటున్నట్లు తెలుసుకున్న మొదట నిశ్చితార్థం చేసుకున్న యువతి నేరుగా పెళ్లి మండపానికి వెళ్లి బంధువులతో కలిసి నయవంచకుడికి దేహశుద్ధి చేసి వన్ టౌన్ పోలీసులకు అప్పగించింది.

అయితే ఈ మోసగాడి నిజస్వరూపం తెలియక పెళ్లి ఏర్పాట్లు చేసిన భరో అమ్మాయి బంధువులు పెళ్లి ఆగి పోవడంతో దిక్కు తోచని స్థితిలో ఉండిపోయారు. ఇది ఇలా ఉండగా గతంలో ఈ మోహన్ క్రిష్ణ నంద్యాలలో ఓ బ్యాంకులో పనిచేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీగా డబ్బులు వసూలు చేసినందుకు ఆయన పై త్రీ టౌన్ స్టేషన్ లో కేసు నమోదైంది. వెంటనే సదరు బ్యాంకు వారు ఈయనను ఉద్యోగం నుండి తొలగించారు.

read more  డిగ్రీ చదువుతున్న ఓ యువతి..

బాధిత యువతి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు నయవంచకుడిపై కేసు నమోదు చేశారు.  బ్యాంకు ఉద్యోగం అంటే అమ్మాయిల తల్లిదండ్రుల్లో ఉండే క్రేజ్ ను సొమ్ము చేసుకోవడానికి చూసి ఇలాంటి ప్రబుద్ధులు చేతిలో మోసపోవద్దని అమ్మాయిల తల్లిదండ్రులకు పొలీసులు హెచ్చరిస్తున్నారు.