డిగ్రీ చదువుతున్న ఓ యువతి..
కృష్ణ జిల్లా అవనిగడ్డలోని పెనుముడి వారధి పై నుండి ఓ యువతి కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నిచింది. అక్కడి ఉన్న పోలీసులు
ఆమె దూకడాన్ని గమనించి అప్రమత్తమై వెంటనే నదిలోకి దూకి ఆ యువతి ప్రాణాలను కాపాడారు.
కృష్ణ జిల్లా అవనిగడ్డలోని పెనుముడి వారధి పై నుండి ఓ యువతి కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నిచింది. అక్కడి ఉన్న పోలీసులు ఆమె దూకడాన్ని గమనించి అప్రమత్తమై వెంటనే నదిలోకి దూకి ఆ యువతి ప్రాణాలను కాపాడారు. అనంతరం చికిత్సకోసం అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
విషాదం... మూడు నెలల గర్భిణి దారుణ హత్య, భర్తే హంతకుడా...?
వివరాల్లోకి వెళితే డిగ్రీ చదువుతున్న ఓ యువతి పులిగడ్డ - పెనుముడి వారధి పైనుండి కృష్ణానదిలోకి దూకేసింది. ఘటన సమీపంలోని కొద్ది దూరంలో పోలీసులు నో యాక్సిడెంట్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఆమె నదిలో దూకడాన్ని గమనించిన వాహనదారులు సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లిన అవనిగడ్డ ASI మాణిక్యాలరావు, కానిస్టేబుల్ గోపిరాజు నదిలోకి దూకి యువతిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం స్ధానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం... లారీ, కారు ఢీ, ముగ్గురి మృతి
ఆ యువతి ప్రాణాలను కాపాడిన ఏఎస్ఐ మాణిక్యాలరావును, కానిస్టేబుల్ గోపిరాజును, స్థానికులు. అధికారులు అభినందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఇందులో కొసమెరుపు ఏంటంటే ఆ యువతి ప్రాణాలు కాపాడిన ఏఎస్ఐ మాణిక్యాలరావు మరికొద్దిరోజుల్లో రిటైర్మెంట్ కానున్నారు. పదవి విరమణ సమయంలో కూడా తన కర్తవ్యాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన ఆయనకు అంభినందనలు వెల్లువెత్తుతున్నాయి.