2004లో టీఆర్ఎస్ బలమెంత: కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పై వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్

తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసి ఏడాది గడిచిందని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. ఏడాదిలో తెలంగాణలో ఎంతో పురుగోతిని సాధించామన్నారు.

 YSRTP Chief YS Sharmila Serious Comments on Congress and TRS


హైదరాబాద్: YS  Rajasekhara Reddy కి ఆనాడు అధికారంలో ఉన్న Congress పార్టీ ప్రభుత్వం కానీ, ఈనాడు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సర్కార్ కానీ గౌరవం ఇవ్వలేదని  YSRTP  చీఫ్ YS Sharmila విమర్శించారు.

ఏడాది కాలంగా Telanganaరాష్ట్రంలో ఎంతో పురోగతిని సాధించినట్టుగా వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు.శుక్రవారం నాడు Hyderabad లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ సమస్యపై తాము పోరాటం ప్రారంభించిన తర్వాత విపక్షాల్లో కదలిక వచ్చిందన్నారు.   ప్రభుత్వం  కూడా ప్రభుత్వ ఉద్యోగాల నోటిపికేషన్లు జారీ చేసిందన్నారు. YSR పాలన ప్రజలకు స్వర్ణయుగమన్నారు.ఉమ్మడి ఏపీ రాస్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ రెండు సార్లు అధికారంలోకి తీసుకు వచ్చారని చెప్పారు.రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాావడానికి వైఎస్ఆర్ కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఇచ్చిన  అధికారాన్ని ఐదేళ్ల పాటు కేంద్రం, రాష్ట్రంలో అనుభవించారని ఆమె కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. వైఎస్ఆర్ కు నివాళులర్పించడానికి  కనీసం స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. హైద్రాబాద్ లో  వైఎస్ఆర్ కు నివాళులు అర్పించుకొనేందుకు సెంట్ భూమి కూడా లేకపోవడం సిగ్గు చేటు కాదా అని ఆమె ప్రశ్నించారు. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎల్పీ నేతగా ఉన్న సమయంలోనే తెలంగాణ వాదం విన్పించేందుకు 40 మంది ఎమ్మెల్యేలతో పంపించారన్నారు. యూపీఏ మేనిఫెస్టోలో కూడా తెలంగాణ అంశాన్ని వైఎస్ఆర్ చేర్పించారన్నారు.2004లో టీఆర్ఎస్ బలం ఎంత అని ఆమె అడిగారు. 2004లో టీఆర్ఎస్ ను వైఎస్ఆర్ కలుపుకొంటేనే ఆ పార్టీ బలం పెరిగిందని షర్మిల చెప్పారు. కేసీఆర్ ను కేంద్ర మంత్రిగా ప్రతిపాదించింది వైఎస్ఆర్ కాదా అని ఆమె అడిగారు. హరీష్ రావును మంత్రి చేసిన చరిత్ర వైఎస్ఆర్ ది కాదా అని అడిగారు.ఇలాంటి వైఎస్ఆర్ కు కేసీఆర్ ఏం చేశారని అడిగారు. తెలంగాణ  ప్రాంతంలో నీటి పారుదల ప్రాజెక్టులకు వైఎస్ఆర్ పెద్దపీట వేశారని ఆమె గుర్తు చేశారు.

తెలంగాణలోనే ఎక్కువగా వ్యవసాయ బోర్లుంటాయనే విషయాన్ని గుర్తుంచుకొనే  వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ను ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ ది కాదా అని ఆమె అడిగారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ఆర్ కోసం అలాట్ చేిన భూమిని కూడా వెనక్కి తీసుకున్నారని వైఎస్ షర్మిల చెప్పారు. వైఎస్ఆర్ ఉన్నతమైన నాయకుడు, ఆయన తీసుకు వచ్చిన ఆరోగ్య శ్రీ పథకం ఎంతో గొప్పదని అసెంబ్లీలోనే కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కేసీఆర్ సర్కార్ వైఎస్ఆర్ కు ఏం గౌరవం ఇచ్చిందన్నారు. ఆయనకు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకొన్నారంటే వైఎస్ఆర్ ను అవమానించినట్టే కాదా అని షర్మిల అడిగారు.వైఎస్ఆర్ చనిపోయారని విషయం తెలుసుకోగానే ఉమ్మడి రాష్ట్రంలో 700 మంది చనిపోతే అందులో తెలంగాణకు చెందినవారు 400 మంది ఉన్నారన్నారు.

also read:అధికారమంటే అహంకారం కాదని నిరూపించాం: వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీలో జగన్

ఇప్పటికీ రాష్ట్రంలో 1500 కి.మీ. పాదయాత్ర పూర్తి చేసినట్టుగా ఆమె చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు ఈ యాత్ర చేస్తున్నట్టుగా ఆమె వివరించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios