అధికారమంటే అహంకారం కాదని నిరూపించాం: వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీలో జగన్


ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీలో టీడీపీ చీఫ్ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోను కూడా చంద్రబాబు మాయం చేశారన్నారు.

AP CM YS Jagan satirical Comments  on Chandrababu In YSRCP Plenary

గుంటూరు: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత 95 శాతం నెరవేరిస్తే  TDP  మాత్రం ఎన్నికల మేనిఫెస్టోను మాయం చేసిందని ఏపీ సీఎం YS Jagan  విమర్శించారు.

శుక్రవారం నాడు YSRCP Plenary లోని వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా  చంద్రబాబుపై విమర్శలు చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో  తమ పార్టీ నుండి 23 మంది ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను లాక్కొన్నారన్నారు.. ఆ దేవుడు దయంతో తాము 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీలు గెలిస్తే TDp  23 ఎమ్మెల్యేలు,  ముగ్గురు ఎంపీలకు మాత్రమే పరిమితమైందన్నారు. అధికారం అంటే అహంకారం కాదని ఈ మూడేళ్ల పాలనలో నిరూపించినట్టుగా జగన్ చెప్పారు.

also read:అమ్మ రాజీనామా... వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా

తమ పార్టీ వెబ్ సైట్ ,యూట్యూబ్ చానెల్స్ లో నుండి కూడా పార్టీ మేనిఫెస్టోను  ను తొలగించారని జగన్ విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీత గా భావించి తాము ఈ మేనిపెస్టోలో పొందుపర్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. కానీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు మేనిఫెస్టో దొరకకుండా చేశారని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు గాను గడప గడపకు వెళ్లి తెలుసుకుుంటున్నామని ఆయన వివరించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios