YS Jagan: అది మీ బాబు గారి సొమ్ము కాదు చంద్రబాబూ.. ఓ రేంజ్‌లో ఫైర్ అయిన జగన్.
వైసీపీ వాళ్లకు పథకాలు ఇవ్వకూడదని చంద్రబాబు అంటున్నారని, ఇవ్వకపోవడానికి అదేమైనా మీ బాబుగారి సొమ్మా.? అంటూ ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం, చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని విరుచుకుపడ్డారు. బడ్జెట్ పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

వైసీపీ నేతలకు పథకాలను ఇవ్వకూడదని చంద్రబాబు అంటున్నారని, ఇవ్వకపోవడానికి అదేమైనా బాబుగారి సొమ్మా అంటూ ప్రశ్నించారు. అది ప్రజల సొమ్మని, ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తోందన్నారు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఇలా.. బహిరంగంగా మాట్లాడతారా?. ఇలాంటి వ్యక్తి సీఎంగా అర్హుడేనా?.. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా?. ఇలాంటిక్తిని సీఎం స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? అంటూ జగన్ ధ్వజమెత్తారు.
ఇంకా మాట్లాడుతూ.. ఉచిత బస్సు కోసం మహిళలంతా ఎదురు చూస్తున్నారన్న జగన్, మహిళలు ఉచిత ప్రయాణాలు ఎప్పుడెప్పుడు చేస్తామా? అని ఆశగా చూస్తున్నారన్నారు. ఆబబిడ్డలు విశాఖ పోదామని అనుకుంటున్నారని, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం ఆడబిడ్డలంతా అమరావతి ఎలా కడుతున్నారో చూడాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఉచిత బస్సులు ఎప్పటి నుంచో అమలు చేస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు. చిన్న పథకాన్ని అమలు చేయడానికి కూడా సాకులు చెబుతున్నారని, ఉచిత బస్సు పథకంతో రూ. 7 వేల కోట్లు ఎగరగొట్టారని విమర్శించారు.
అందుకే మీడియా ముందుకు వచ్చాం:
అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినడం లేదని, అందుకే మీడియా ముందుకు వచ్చామన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టింది. సూపర్ సిక్స్, 143 హామీల కోసం అరకోర కేటాయింపులు చేశారు. అన్నిరకాలుగా మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తోందన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్, సెవెన్ అంటూ ఊదరగొట్టారని, చంద్రబాబు దత్తపుత్రుడు కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారన్నారు. కానీ వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. ఇప్పుడు హామీలపై అడిగితే సమాధానం లేదని, రెండు బడ్జెట్‌లలోనూ నిధులు కేటాయించలేదంటూ విమర్శించారు.
గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు:
9 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారన్న జగన్ ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా చంద్రబాబు బడ్జెట్ ప్రసంగం ఉందని విమర్శించారు. ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి రూ.72 వేలు ఎగనామం పెట్టారు. 2024-25 సోషియో ఎకనమిక్ సర్వేలో ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో 27 లక్షల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. బడ్జెట్‌లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? అంటూ ప్రశ్నించారు.
దానికి కూడా ఎగనామం పెట్టారు:
18 నుంచి 60 ఏళ్ల మహిళకు సంవత్సరానికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి అన్నారుని, దానికి కూడా ఎగనామం పెట్టారని విమర్శించారు. తల్లికి వందన్ పథకంలో భాగంగా స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల సాయం అన్నారు. ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని అన్నారు. మొదటి బడ్జెట్‌లో రూ. 5, 386 కోట్లు కేటాయింపులు చేశారు. ఈసారి నెంబర్ మోసంతో ప్రజలను మభ్య పెడుతున్నారు. ఎలాగూ మోసం చేసేది కదా అని ఇలా చేస్తున్నారు. చివరికి చిన్న పిల్లాడికి కూడా బకాయిలు పెడుతూ.. ఎగనామం పెడుతున్నారు.
రైతులను కూడా మోసం చేస్తున్నారు:
రైతులను మోసం చేయడం చంద్రబాబుకు కొత్తేం కాదన్న జగన్, రైతు భరోసా పేరిట రైతన్నలను గతంలోనే కాదు.. ఇప్పుడూ మోసం చేస్తున్నారని విమర్శించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేల సాయం అందిస్తామన్నారు. కిందటి ఏడాది ఎగ్గొట్టారు. ఈసారి కూడా ఆ పని చేస్తే.. రెండు బడ్జెట్‌లకు కలిపి రూ.40 వేలు ఎగనామం పెట్టినట్లు అవుతుందని ఆరోపించారు. ఇక చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్‌ల విషయంలో మరో 20 లక్షల మంది యాడ్ కావాల్సి ఉందని. ఇలా రెండేళ్లలో రూ.96 వేల చొప్పున మోసం చేశారన్నారు.
జగన్ పూర్తి ప్రెస్ మీట్ విశేషాల కోసం ఇక్కడ చూడండి:

