Asianet News TeluguAsianet News Telugu

యువకుడితో అర్థనగ్న నృత్యాలు.. ఒళ్లంతా తడుముతూ, చెంపలు తాకుతూ ఓ రౌడీషీటర్ పైశాచికానందం.. వీడియో వైరల్..

ఓ రౌడీషీటర్ పాతబస్తీలో యువకులతో ముజ్రా నృత్యం చేయించడం.. వారితోఅర్థనగ్న నృత్యాలు చేయిస్తూ.. అసహజంగా ప్రవర్తించడం వెలుగులోకి వచ్చింది. 

Young man Stripped Naked and Dance By Rowdy Sheeter in Hyderabad, video goes viral - bsb
Author
First Published Jan 24, 2023, 8:14 AM IST

హైదరాబాద్ : అమ్మాయిలతో అర్ధనగ్న నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు.. పండుగలు, శుభకార్యాల సమయాల్లో చేయించడం తెలిసిన విషయమే. ఇక అమ్మాయిలు, ట్రాన్స్ జెండర్ లతో ముజ్రాలు చేయించడం పాతబస్తి శివారులో అక్కడక్కడా, అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అయితే దీనికి భిన్నంగా పాతబస్తీలో ఓ రౌడీ షీటర్ యువకులతో  అర్థనగ్న నృత్యం చేయించాడు. వారిని కత్తితో బెదిరించి బట్టలు చింపేసి..  కేవలం డ్రాయర్ల మీద నృత్యం చేయిస్తూ..  వారి శరీర భాగాలను తడుముతో పైశాచిక ఆనందం పొందాడు. 

ఆ యువకుల చెంపలపై ముద్దులు పెడుతూ అసహజ కార్యానికి  తెరలేపాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మూడు నెలల క్రితం మర్ఫా అనే అరబిక్ బ్యాండ్ మ్యూజిక్ మధ్య ఈ పని జరిగినట్లు సమాచారం. ఈ వీడియోలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. ఇవి వైరల్ కావడంతో చాంద్రాయణ గుట్ట పోలీసులు స్పందించారు. వీడియోను పరిశీలించి అందులో ఉన్న బాధితుడు నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. 

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్: 2.73 శాతం డీఏ మంజూరు

యువకుడిని కత్తితో బెదిరించి.. బట్టలూడదీసి డ్రాయర్ పై నగ్నంగా నృత్యం చేయించిన సదరు వ్యక్తిని గుర్తించారు. అతను బార్కాస్  సలాలాలో ఉండే వ్యక్తి అని తెలిసింది. ఆ వ్యక్తి పేరు అలీబా ఈసా (45). అతని మీద చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ నమోదయింది. అయితే ఈ ఘటన నేపథ్యం మూడు రోజుల క్రితం జరిగిన గొడవ చర్చనీయాంశంగా మారింది. 

ఈనెల 20న పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ నేపథ్యంలో నడిరోడ్డుపై కత్తి పట్టుకుని వీరంగం సృష్టించింది సదరు రౌడీషీటరే. మరో రౌడీషీటర్ సులేమాన్ బామ్(40)మీద కత్తితో దాడిచేశాడు. అతను బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ గా  నమోదయ్యాడు. అతని మీద కత్తితో దాడి చేసి గాయపరిచాడు అలీబా ఈసా. పోలీసులు అదే రోజు అలీపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఇంతలోనే అతని పైశాచికత్వాన్ని రుజువు చేస్తూ ఈ వీడియో బయటికి రావడం విశేషం.

అలీబా ఈసా రౌడీ షీటర్ గా అనేక అరాచకాలకు పాల్పడుతుంటాడు. గొడవలకు దిగుతుంటాడు. మద్యం మత్తులో వీరంగం వేస్తాడు. ఈనెల 20న అలాగే జరిగింది. అలీబా ఈసా  సోదరుడు వాహద్-బా-ఈసా సలాల రోడ్డులోని ఓ జిమ్ కు వచ్చాడు.  ఈ క్రమంలో తన బండిని ఓ దుకాణం ముందు పెట్టాడు. అయితే ఆ దుకాణం యజమాని వృద్ధుడైన హసన్ వహలాన్ దీనికి అభ్యంతరం చెప్పాడు. తన దుకాణానికి లోడుతో డీసీఎం వాహనం వస్తుందని.. టూవీలర్ను వేరే చోట పెట్టాలని కోరాడు.

దీంతో కోపానికి వచ్చిన పహాద్ ఆ వృద్ధుడితో గొడవకు దిగాడు. ఇది అటు నుంచి వెళుతున్న సులేమాన్ బామ్ గమనించాడు. ముసలాయనతో గొడవ ఏంటని పహాద్ ను వారించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ గొడవ నేపథ్యంలోనే ఫహాద్ సోదరుడు అలీబా ఈసా కత్తితో అక్కడికి వచ్చాడు. పోలీసులు ఉన్నా..  వారి ముందే సులేమాన్ బామ్ మీద దాడి చేసి పారిపోయాడు. దీనిమీద పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయింది

తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో అలీ దాడులే కాదు.. అర్థనగ్న నృత్యాలతో కూడా హింసిస్తాడని తెలుస్తోంది. మద్యం మత్తులో అతను తరచుగా ముజ్రాలు చేయిస్తుంటాడని తేలింది. ఆ సమయంలో కత్తితో బెదిరిస్తూ యువకులను అసభ్యంగా తాకుతూ.. అసహజంగా ప్రవర్తిస్తాడని.. వైరల్ అయిన వీడియోలోని బాధితుడు షేక్ సాలం బావజీర్ తెలిపాడు. అయితే ఈ వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో హత్యాయత్నం కేసులో నిందితుడుగా ఉన్న అలీబా ఈసా… పోలీసుల ముందు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios