రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2.73 డీఏను ప్రకటించింది. 2021 జూలై నుండి 2022 డిసెంబర్ వరకు ఈ డీఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది.
హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు ప్రభుత్వం 2.73 శాతం డిఏను ప్రకటించింది. 2021 జూలై నుండి 2022 డిసెంబర్ వరకు ఉద్యోగులకు డీఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. ఎనిమిది విడతల్లో బకాయిలను చెల్లించనున్నారు..
Scroll to load tweet…
#
Scroll to load tweet…
ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న డీఏను 17.29 నుండి 20.02 శాతానికి పెంచింది ప్రభుత్వం, డీఏ పెంపుతో 4.40 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది కలగనుంది. డీఏ పెంపు కారణంగా 2.38 లక్షల మంది పెన్షనర్లకు కూడా ప్రయోజనం కలగనుంది. ఎనిమిది విడతల్లో ఉద్యోగులకు బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది.
