నల్గొండ : వేట కొడవళ్లతో యువకుడిని నరికి చంపిన దుండగులు.. పరువు హత్యగా అనుమానం
నల్గొండ జిల్లా నిడమానురు మండలం గుంటిపల్లిలో ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. అయితే ప్రేమే వ్యవహారంగా ఇందుకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
నల్గొండ జిల్లా నిడమానురు మండలం గుంటిపల్లిలో దారుణం జరిగింది. ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. అయితే ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అమ్మాయి తరపు బంధువులే యువకుడిని హత్య చేసి వుంటారని అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ఇకపోతే.. ఉత్తరప్రదేశ్‌లో 20 ఏళ్ల కుమార్తెను గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని నదిలో విసిరేశాడో కిరాతక తండ్రి. ఆ వ్యక్తిని గురువారం అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. మహుదీహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెటిమ్‌పూర్ మథియా గ్రామానికి చెందిన కాజల్ మృతదేహం ఏప్రిల్ 2న ఛోటీ గండక్ నదిలో లభ్యమైందని పోలీసు సూపరింటెండెంట్ సంకల్ప్ శర్మ తెలిపారు. కొన్ని రోజులుగా ఆమె కనిపించకుండా పోయిందని శర్మ తెలిపారు.
Also Read: తమిళనాడులో పరువు హత్య: నడిరోడ్డుపై యువకుడిని చంపిన యువతి బంధువులు
పోస్టుమార్టం పరీక్షలో ఆమె గర్భవతి అని తేలిందని పోలీసులు తెలిపారు. కాగా, గ్రామంలోని ఓ యువకుడితో ఆమెకు అక్రమ సంబంధం ఉందని, ఎవరో ఆమె తండ్రి నౌషాద్‌కు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. ఈ వార్తలతో కలత చెందిన నౌషాద్ కాజల్‌ను హత్య చేసినట్లు విచారణలో తేలింది. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ఛోటీ గండక్ నదిలో విసిరినట్లు పోలీసులు తెలిపారు.
సంఘటనకు ముందు నౌషాద్ తమందరినీ మతపరమైన ప్రదేశానికి పంపించాడని నిందితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారని ఎస్పీ తెలిపారు. ఆ తరువాత ఇంటికి తిరిగివచ్చిన కుటుంబ సభ్యులతో అతను తన కుమార్తె తప్పిపోయిందని పోలీసులకు తెలిపాడు. ఆ తరువాత కూతురును వెతకడంలో కూడా సాయపడ్డాడు. చివరికి మృతదేహం దొరకడంతో.. అనుమానంతో విచారించగా అతను నిజం ఒప్పుకున్నాడని అధికారి తెలిపారు.