తమిళనాడులో పరువు హత్య: నడిరోడ్డుపై యువకుడిని చంపిన యువతి బంధువులు

తమిళనాడు రాష్ట్రంలో  పరువు  హత్య  జరిగింది.  శరణ్య  అనే యువతి, జగన్ లు  రెండు మాసాల  క్రితం వివాహం  చేసుకున్నారు.ఈ వివాహం నచ్చని  శరణ్య  పేరేంట్స్   జగన్ ను ఇవాళ హత్య చేశారు. 

 Honour killing  in  Tamilnadu: Jagan  killed by Sharanyas  family members lns


చెన్నై: తమిళనాడు  రాష్ట్రంలో  మంగళవారంనాడు పరువు  హత్య  చోటు  చేసుకుంది.  నడిరోడ్డుపై జగన్ అనే యువకుడిని  యువతి  బంధువులు  అత్యంత దారుణంగా హత్య  చేశాడు.  ఈ ఘటనలో  జగన్   అక్కడికక్కడే మృతి చెందాడు. 

తమిళనాడు  రాష్ట్రంలోని కృష్ణగిరి సమీపంలోని  కేఆర్‌పీ డ్యామ్  హైవేపై  ఈ ఘటన  చోటు  చేసుకుంది.  రెండు నెలల క్రితం  శరణ్య, జగన్ లు  ప్రేమించి  పెళ్లి  చేసుకున్నారు.  ఈ విషయం  శరణ్య  పేరేంట్స్ కు నచ్చలేదు.   దీంతో   జగన్ ను హత్య  చేయాలని  శరణ్య కుటుంబ సభ్యులు  నిర్ణయించుకున్నారు.  ఇవాళ  కృష్ణగిరి సమీపంలోని  కేఆర్‌పీ డ్యామ్  హైవేపై జగన్ ను  రోడ్డుపై  చంపారు. 

కృష్ణగిరి  జిల్లా కిట్టంబట్టికి  చెందిన   జగన్ స్థానికంగా  టైల్స్  కంపెనీలో  పని చేస్తున్నాడు. ఇవాళ మధ్యాహ్నం  జగన్  కిట్టంబట్టి  నుండి  కావేరీపట్టణం వైపునకు  బైక్ పైవ వెళ్తున్న సమయంలో  ఈ ఘటన  చోటు  చేసుకుంది. జగన్  కావేరీపట్టణం వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న   శరణ్య  బంధువులు   కేఆర్‌పీ డ్యామ్  వద్ద   మాటువేసి  జగన్ పై దాడి చేశారు.  బైక్ పై వెళ్తున్న  జగన్ ను శరణ్య బంధువులు అడ్డగించారు.   జగన్ పై  రోడ్డుపై  దాడికి దిగారు. ఈ దాడిలో  జగన్  అక్కడికక్కడే  మృతి చెందారు. ఈ ఘటనపై  జగన్  కుటుంబసభ్యులు  ఆందోళనకు దిగారు . జగన్ ను  హత్య  చేసిన నిందితులను  కఠినంగా  శిక్షించాలని  డిమాండ్  చేశారు.

జగన్ మృతదేహన్ని  పోస్టుమార్టం  నిమిత్తం  కృష్ణగిరి  ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  మృతుడి  కుటుంబ సభ్యుల  ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు.  

గతంలో  కూడా  దేశంలోని  పలు  ప్రాంతాల్లో  పరువు హత్య ఘటనలు  చోటు  చేసుకు్న్నాయి.  హైద్రాబాద్ దూలపల్లిలో"  ఈ నెల 3వ తేదీన   పరువు హత్య  చోటు  చేసుకుంది. 

 ఈ ఏడాది ఫిబ్రవరి 20న  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో  పరువు హత్య  జరిగింది. యువతి ప్రేమ వ్యవహరం నచ్చని  పేరేంట్స్  యువతిని  హత్య  చేశారు.  యువతిని హత్య  చేసి మృతదేహన్ని కాలువలో  వేశారు.  

also read:దూలపల్లి పరువు హత్య కేసు .. మృతుడి బావమరిది సహా 11 మంది అరెస్ట్, 5 నెలల క్రితమే రెక్కీ
 
 తెలంగాణలోని   భువనగిరి  జిల్లాలో 2017లో  జరిగిన  పరువు  హత్య  కలకలం  రేపిన విషయం తెలిసిందే.  నరేష్ అనే యువకుడిన  అత్యంత దారుణంగా యువతి  బంధువులు  హత్య  చేసిన విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios