Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లో అద్దెకుండే యువతిని లోబర్చుకుని... తల్లిని చేసిన ఓనర్ కొడుకు

ఇంట్లో అద్దెకుండే యువతిని మాయమాటలతో నమ్మించి శారీరకంగా దగ్గరయిన ఓనర్ కొడుకు తల్లిని చేసాడు.   

Young girl gives birth to child before marriage in Shankarpally Rangareddy District AKP
Author
First Published Jun 2, 2023, 10:03 AM IST

శంకర్ పల్లి : ఓ ఇంట్లో అద్దెకుండే యువతిని యజమాని కొడుకు ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఒకే ఇంట్లో వుండేవారు కాబట్టి ఈ ప్రేమజంట శారీరకంగా కూడా కలిసారు. ఇలా పలుమార్లు లైంగికంగా దగ్గరవడంతో యువతి గర్భం దాల్చి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇలా యువతిని తల్లినిచేసినవాడు పెళ్లికి మాత్రం అంగీకరించకుండా ముఖం చాటేస్తున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామానికి చెందిన ఓ కుటుంబం శంకర్ పల్లిలో నివాసముంటున్నారు. హనుమాన్ కాలనీలోని ఓ ఇంట్లో పెళ్లిడు(20) కూతురితో కలిసి తల్లిదండ్రులు అద్దెకు వుండేవారు. అయితే వీరు అద్దెకుండే ఇంటి యజమాని కొడుకు కార్తిక్(24) యువతిపై కన్నేసాడు. యువతితో పరిచయం పెంచుకుని మాయమాటలతో ప్రేమలోకి దించాడు. యువతిని పూర్తిగా తన మాయలోకి దించి శారీరకంగా కూడా దగ్గరయ్యాడు.  

ఎలాగూ ప్రేమించుకున్నాం... త్వరలోనే పెళ్లి చేసుకుంటాం... శారీరకంగా కలిస్తే తప్పేంటి అంటూ మాయమాటలతో యువతిని నమ్మించాడు. నిజంగానే పెళ్లి చేసుకుంటాడని భావించిన యువతి అతడికి దగ్గరయ్యింది. రెండేళ్ళపాటు ఇలా ఇద్దరి ప్రేమ సాఫీగా సాగింది. 

Read More  వివాహేతర సంబంధం : షిర్డీ వెడుతున్నానని చెప్పి.. స్నేహితుడి భార్యతో వ్యాపారి అదృశ్యం..

అయితే యువతి గర్భం దాల్చడంతో వీరి ప్రేమవిషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. దీంతో తమ బిడ్డను గర్భవతిని చేసిన కార్తిక్ తో పెళ్లి చేయాలని అమ్మాయి తల్లిదండ్రులు కోరారు. ఇందుకు కార్తిక్  తో పాటు అతడి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఇలా కొంతకాలంగా ఇరుకుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం యువతి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇప్పటికయినా పెళ్లి చేసుకోవాలని యువతి తల్లిదండ్రులు కార్తిక్ కుటుంబాన్ని కోరారు. అయినా వారు ఒప్పుకోకపోవడంతో బాధిత యువతి కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. 

తమ బిడ్డను తల్లిని చేసి ఇప్పుడు పెళ్లిచేసుకోవడం లేదంటూ యువతి పేరెంట్స్ కార్తీక్ పై శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. యువతికి న్యాయం జరిగేలా చూడాలని బాధిత కుటుంబం కోరుతోంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios