యోగి... ఇలా వచ్చి అలా జైలుకు (2 వీడియోలు)

yogi sent back to jail for not providing surity to the court
Highlights

  • కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
  • బెయిల్ ఇచ్చిన మియాపూర్ కోర్టు
  • సొంతపూచికత్త సమర్పించలేక జైలుకు యోగి
  • సెల్పీ వీడియోలో సంచలన విషయాలు చెప్పిన హారిక

సినీనటి హారిక వేధింపుల కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. హారిక తనను వేధిస్తున్నట్లు పోలీసు కేసు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు యోగి కోసం వేట మొదలు పెట్టారు. అయితే గత 5రోజులుగా తప్పించుకు తిరుగుతున్న యోగిని ఇవాళ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. యోగి మీద 354,506 సెక్షన్ల కింద హారిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. అయితే యోగికి కోర్టులో బెయిల్ మంజూరైంది. యోగి కోర్టుకు ఇలా వెళ్లి అలా బెయిల్ తీసుకుని బయటకు వచ్చేవాడే. కానీ.. ఇక్కడ మరో ములపు తిరిగింది. యోగి సొంత పూచికత్తు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు. దీంతో బెయిల్ మంజూరైనా యోగి జైలుపాలయ్యాడు. యోగిని కోర్టులో హాజరు పరిచే వీడియో కింద చూడండి.

ఇక యోగి వాట్సాప్ మెసేజ్ లు బయట పెట్టడంపై సినీనటి హారిక మండిపడ్డారు. యోగి బయటపెట్టిన వాట్సాప్ చాట్ గురించి హారిక సంచలన విషయాలు వెల్లడించారు. తాను ఒక సెల్ఫీ వీడియో మీడియాకు వెల్లడించారు. యోగితో తాను చాటింగ్ చేసిన మాట నిజమేనని, అయితే అతడు బైట పెట్టిని వాట్స్ ఆప్ వివరాలు మాత్రం నిజం కాదని అన్నారు. అతడు పంపిన మెసేజ్ లను డిలేట్ చేసి క్రిమినల్ మైండెడ్ గా తన మెసేజ్ లలో కొన్నింటిని మాత్రమే బైటపెట్టాడని తెలిపింది.  ఆ మొత్తం మెసేజ్ లు చూస్తే తాను ఏ ఉద్దేశంతో అతా మాట్లాడానో తెలుస్తుందని హారిక తెలిపింది. తనను అరెస్ట్ చేయించడానికి ప్రయత్నించాననే ఈగోతోనే యోగి ఇలా  తప్పుడు వాట్సాఫ్ మెసేజ్ లను సృష్టించి తన పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నాడని హారిక తెలిపింది. హారిక పంపిన సెల్పీ వీడియో కింద చూడొచ్చు.

loader