చిత్తూరు జిల్లాలోని వడమాలపేట మండలం లోని ఓబిఆర్ కండ్రిగ గ్రామంలో  ఆదివారం క్షత్రియ ఐక్యత  నిబద్ధత గ్రూప్ ఆధ్వర్యం లో క్షత్రియ మహిళా దినోత్సవం జరిగినది . ఈ కార్యక్రమం లో ఆ సంఘ  రాయలసీమ మహిళా  అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడారు. నేటి కాలంలో  మహిళలు అన్ని రంగాలలోను  రాణిస్తున్నారని , అదే కోవలో  క్షత్రియ మహిళలు కూడా అనేక రంగాలలో  విశిష్ట  సేవలు  అందింస్తున్నారన్నారు. వారిలో  కొందరిని  అయినా కింగ్ (క్షత్రియ ఐక్యత నిబద్ధత గ్రూప్) ఆధ్వర్యంలో  సన్మానించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

సన్మానించిన  క్షత్రియ ఐక్యత నిబద్దత గ్రూపు కార్యవర్గానికి కృతఙ్ఞతలు తెలియ చేశారు. వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతీశ్వర రాజు మాట్లాడుతూ  క్షత్రియ మహిళలకు  సన్మాన గ్రహీతల సేవలు స్ఫూర్తిదాయకం  కావాలని  పేర్కొన్నారు . క్షత్రియ మహిళలలో  రాజకీయ రంగంలో  రాణిస్తున్న  తిరుపతి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీదేవి రుద్రరాజును , చిత్తూరు  జిల్లా బీజేపీ మహిళా అధ్యక్షురాలు నిషిధ రాజును , ఉపాధ్యాయ  రంగం నుండి శారదా రాణిని , సేవా రంగం నుండి  నెహ్రు  యువజన కేంద్రం అధ్యక్షురాలు జ్యోతిలక్ష్మిని , వివిధ  క్షత్రియ మహిళా సర్పంచ్ లను  , వివిధ క్షత్రియ మహిళలను  సన్మానించారు.

సన్మాన  కార్య క్రమం  అనంతరం  సన్మాన గ్రహీతల  చేత మండలం లోని ఆరవ తరగతి  నుండి పదో  తరగతి వరకు చదువుచున్న  క్షత్రియ బాల  బాలికలకు పరీక్షలకు అవసరమైన రైటింగ్  ప్యాడ్లు, జామెంట్రీ  బాక్స్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రఘురామ  రాజు , శివశేఖర్  వర్మ , రమేష్ రాజు , తులసీరామ  రాజు , రాధాకృష్ణమ రాజు , మధుసూధన రాజు , హృషికేశవ  రాజు , ఆది  నారాయణ రాజు , అశోక్ రాజు , ప్రసాదరాజు , బాలాజీ రాజు , ఉమ, శిరీష , రజని ,   ప్రమీళ  పాల్గొన్నారు.